నవతెలంగాణ – అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీతామహాలక్ష్మి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వంశీకి కిందికోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇదే సమయంలో, వంశీపై ఉన్న అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసును జులై 16కు వాయిదా వేసింది.
సుప్రీంలో వంశీకి భారీ ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES