Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత ఆరోగ్య క్యాంపుకు భారీ స్పందన

ఉచిత ఆరోగ్య క్యాంపుకు భారీ స్పందన

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య క్యాంపుకు భారీ స్పందన లభించింది. మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు సుమారుగా 310 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో గుండె సంబంధిత నిపుణుడు మహేష్ కుమార్ పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 50 నుంచి 60 మంది వరకు పలు రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. 5 మందికి 2డికో పరీక్షలు నిర్వహించగా వారు గుండె సంబంధిత వ్యాధితో ఉన్నట్లు తెలిపారు. వారు అలక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రేమ్ సింగ్, జైపాల్, రమేష్, దేవి సింగ్, మహమ్మద్, కుమార్ సింగ్, భగత్ సింగ్, సాయి రెడ్డి, సంజు రెడ్డి, వైద్య సిబ్బంది, స్థానిక అరెంపీలు, పీఎంపీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -