నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ చైతన్ యాదవ్ ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య క్యాంపుకు భారీ స్పందనలభించింది. మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు సుమారుగా 300 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండె సంబంధిత నిపుణుడు డాక్టర్ రవితేజ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వరకు పలు రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారుపరీక్షలు నిర్వహించగా వారు గుండె సంబంధిత వ్యాధితో ఉన్నట్లు తెలిపారు. సంబంధిత ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు.
లైన్స్ క్లబ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 40 మందికి కంటి సమస్యలు ఉన్నాయని దగ్గర్లో ఉన్న లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చు అవుతుందని ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా ఏదైనా వ్యాధులు వస్తేనే ఆసుపత్రికి వెళ్తున్నారు అని గ్రహించి ఈ మెగా హెల్త్ క్యాంపు ని ఏర్పాటు చేశామని ఇటువంటి హెల్త్ క్యాంపు సంవత్సరానికి ఒక్కసారి ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ఆరోగ్యాలను మెరుగు ఉండే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ దివ్య సతీష్ యాదవ్, మాజీ సర్పంచ్ బుషప్ప, బాబు దేశాయ్, శ్రీకాంత్, మహేందర్, సంతోష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



