- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ చరిత్రలో తొలిసారిగా రూ.44,557 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రూ.40,209 కోట్లు రాగా, ఈ ఏడాది 7% వృద్ధి నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్లు, కొత్త దుకాణాల దరఖాస్తులు, వైన్స్, బార్ల అద్దె ద్వారా రూ.5,189 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ నెలలో రూ.5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
- Advertisement -



