Sunday, December 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. 

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. 

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తిరుమల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్లు కాంప్లెక్స్ బయట వరకు విస్తరించాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరి స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.

ఇక శనివారం నాడు 80,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. వీరిలో 31,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -