Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంఒడిశా SI నియామకాల్లో భారీ స్కాం.. 150 మంది అభ్యర్థుల అరెస్ట్

ఒడిశా SI నియామకాల్లో భారీ స్కాం.. 150 మంది అభ్యర్థుల అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశా పోలీసు సబ్​ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ స్కాం వెలుగులోకి వెచ్చింది. రిక్రూట్​మెంట్ ప్రక్రియలో పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.  150 మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్​ చేశారు.  వివరాల్లోకి వెళితే..  ఒడిశా సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నియామక పరీక్షలో భారీ మోసాన్ని బెర్హంపూర్ పోలీసులు బయటపెట్టారు.SI నియామక పరీక్ష నిర్వహించే బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ స్కాం కు పాల్పడినట్లు గుర్తించారు. నియామకాల్లో అవకతవలకు పాల్పడేందుకు తరలిస్తున్న ట్లు ఆరోపణలు రావడంతో ఈ స్కాంతో  సంబంధమున్న 150మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్​ చేశారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడే వ్యూహంలో భాగంగా హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా 150 మందికి పైగా అభ్యర్థులను బెర్హంపూర్​ పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -