Friday, July 11, 2025
E-PAPER
Homeఖమ్మంఇరుకు క్రాసింగ్ లతో భారీ ట్రాఫిక్ జాం..

ఇరుకు క్రాసింగ్ లతో భారీ ట్రాఫిక్ జాం..

- Advertisement -

ప్రధాన రహదారి – వ్యాపార సముదాయాలు….
ప్రమాదాలకు నిలయంగా రోడ్ డివైడర్ క్రాసింగ్ లు…
వాహనాలు తిరగడానికి నానా ఇక్కట్లు…
వెడల్పు పెంచాలని వాహనదారులు, వ్యాపారులు వేడుకోలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అసలు కే ప్రధాన రహదారి.కొసరుగా ఇరువైపులా వ్యాపార సముదాయాలు. నిత్యం రద్దీ రాకపోకలు..వీటిని అధిగమించి ప్రమాదాలు నివారణకు రహదారి నియమాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఆ నియమాలే రాకపోకలకు ఆటంకంగా మారితే పైగా ప్రమాదాలు కు హేతువైతే అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా..

ప్రస్తుతం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్ లో పోలీస్ స్టేషన్ నుండి హెచ్.పీ బంక్ వరకు 1.5 కి.మీ పొడవున రూ.11.75 కోట్లు నిధులతో పనులు నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా నిర్మిస్తున్న రోడ్ డివైడర్ క్రాసింగ్ లు సమస్యాత్మకంగా మారాయి.

రోడ్డు డివైడర్ క్రాసింగ్  అంటే: రహదారి మధ్యలో వాహనాలు, పాదచారులు వేర్వేరు దిశల్లో ప్రయాణించేందుకు ఏర్పాటు చేసే నిర్మాణం లేదా గీత. దీనిని అడ్డంకులు, డివైడర్ లు, మీడియన్ అని కూడా పిలుస్తారు. 

రోడ్డు డివైడర్ లు ఎందుకు ఉపయోగిస్తారు: రహదారి మధ్యలో అడ్డంకులు ఏర్పాటు చేయడం వలన, వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనకుండా, వ్యతిరేక దిశల్లో ప్రయాణించే వాహనాలు వేరుగా ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటే టప్పుడు సురక్షితంగా ఉండటానికి సహాయపడతాయి.  కొన్ని సందర్భాల్లో, రహదారి ప్రక్కన వాహనాలు పార్క్ చేయకుండా లేదా ఇతర అవాంఛిత ప్రదేశాల లోకి వెళ్లకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారు. 

తిరిగే వాహనాలను బట్టి, రద్దీని బట్టి క్రాసింగ్ నిడివి ఆధారపడి ఉంటుంది. సాదారణ ద్విచక్ర వాహనాలు తిరిగి ప్రదేశం అయితే 8 మీటర్ లు, ఆటోలు, జీప్ లు, కార్ లు తిరిగే ప్రాంతం అయితే 15 మీటర్ లు, లారీలు, బస్ లు, ట్రాలీ లాంటి బహుళ చక్రాలు ఉన్న భారీ వాహనాలు తిరిగే చోటు అయితే 20 మీటర్ లు నిడివితో ఉండేలా క్రాసింగ్ లు ఏర్పాటు చేస్తారు.

ప్రస్తుతం రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహిస్తున్న నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో
అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్ లో రోడ్ డివైడర్ క్రాసింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసారని పట్టణ వాసులు, వాహన దారులు, వాహన చోదకులు వాపోతున్నారు. ఈ రోడ్ లో ఒకటిన్నర కిలో మీటర్ రోడ్ లో మొత్తం ఎనిమిది చోట్ల డివైడర్ క్రాసింగ్ లు ఏర్పాటు చేసారు.

బస్ స్టాండ్ సమీపంలో బస్ లు రాకపోకలు కోసం ఇన్, ఔట్   ల కోసం 2,లక్ష్మీ( రెడ్డిగారి) మెడికల్ సమీపంలో 1,గుర్రాల చెరువు క్రాస్ రోడ్ సమీపంలో 1, గౌడ్ బజారు సమీపంలో 1, ఆయిల్ బంక్ సమీపంలో ఒకటి, శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ సమీపంలో 1 మొత్తం 8 క్రాసింగ్ లు ఏర్పాటు చేసారు. అయితే ఎక్కడ ఎంత నిడివి ఉండాలి అనేది మాత్రం రహదారి నిబంధనలకు విరుద్ధంగా ఉందనేది వాహనాలు రాకపోకలు బట్టి అర్ధం అవుతుంది. ఈ 8 క్రాసింగ్ ల్లో 2 మాత్రం  ప్రభావిత వ్యక్తుల ఆసక్తి మేరకు ప్రత్యేకంగా నిర్మించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రభావిత వ్యక్తుల ద్వారా ఏర్పాటు అయినప్పటికి అక్కడ భారీ వాహనాలు క్రాస్ అవడం మాత్రం కష్టంగానే ఉంది.ఈ రహదారిలో ఆంధ్రా డిపోల కు చెందిన 9, భద్రాచలం డిపోకు చెందిన 9 బాస్ లు మొత్తం 18 సర్వీసు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. పైగా ఈ రోడ్ మొత్తం ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండటంతో సరుకులు లారీలు, వినియోగదారుల వాహనాలతో రద్దీ అధికంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. నిర్మాణ దశలోనే లక్ష్మీ మెడికల్ ఎదురుగా గల క్రాసింగ్ లో డివైడర్ వాహనం ఢీకొనడంతో శిధిలం అయింది.

 కాబట్టి అలైన్మెంట్ మార్చి క్రాసింగ్ లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, వ్యాపారులు కోరుతున్నారు. ద్విచక్రవాహనాల కోసమే ఆ క్రాసింగ్. భవిష్యత్తులో మూసి వేస్తాం – ఆర్ అండ్ బీ డీఈఈ ప్రకాశ్.

ద్విచక్రవాహనాలు, కార్లు రాకపోకలకు ఆ ప్రాంతం వాసులు వినతి మేరకు చిన్న క్రాసింగ్ ఇచ్చాం. భారీవాహనాలు కోసం కాదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే భవిష్యత్తులో మూసి వేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -