Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌ పేరుతో మానవ హననం సరికాదు

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మానవ హననం సరికాదు

- Advertisement -

కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం ఏకపక్ష విధానాలు
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

మావోయిస్టులపై ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మానవ హననానికి పాల్పడటం సరైంది కాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌లో ”సంక్షోభ కాలం రాజ్యాంగ హక్కులు” అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వేదిక నాయకులు వంగాల సంతోష్‌, రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెలుతురు సదానందంలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను తీవ్రంగా ఖండించారు. పిడికెడు మంది కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలు నెరవేర్చడానికి ఈ దేశ ప్రజలపై పాలకులు ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షులు విమలక్క మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా అందరం ఐక్యమై పోరాడుదామని పిలుపునిచ్చారు. జస్టిస్‌(రిటైర్డ్‌) చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలను హింసించి చంపితే, ప్రజాస్వామ్య మవు తుందా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం పేరుతో విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తన సందేశాన్ని పంపగా వక్తలు చదివి వినిపించారు. ఈ సమా వేశంలో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి, ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వరావు, కట్టా భగవంత్‌ రెడ్డి, ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు మస్కుల మట్టయ్య, కాశం సత్యనారాయణ, ఆప్‌ నాయకులు సుధాకర్‌, ఏఐటీయూసీ నాయకులు బాల్‌రాజు, పరమేష్‌, టీపీడీఎఫ్‌ రాష్ట్ర నాయకులు ప్రకాష్‌, రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెల్తురు సదానందం, నాయకులు వెంకటేశ్వర్‌ రావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మల్సూర్‌, పోతుల రమేష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాకేష్‌, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్‌, రాష్ట్ర నాయకులు రాయమల్లు, వెంకట్‌ లక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -