ఈ భూగోళం మానవ శరీరం లాంటిది. శరీరంలోని ఏ అవయవానికి హాని కలిగినా మొత్తం శరీరంపై దాని ప్రభావం ఉంటుంది. చిటికెన వేలి బాధ ఆ వెలికే పరిమితం కాదు. జీవ వైవిధ్యం మానవ శరీరం అనుకుంటే అందులోని ఏ జాతి జీవులు నశించినా దాని ప్రభావం మానవజాతిపై పడక తప్పదు. ఈ నిజాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించినా ఎంతమాత్రం ఫలితం ఉండదు. ప్రపంచంలోని ప్రతి మనిషి గుర్తించాలి. అప్పుడే జీవ వైవిధ్యం మనుగడ సాగిస్తుంది.ఈ విశ్వంలోని సకల ప్రాణులు ఒక జీవి మరొక జీవిపై ఆధారపడి ఉంది. అన్ని ప్రాణులకు ఆహారం లభించాలంటే జీవులన్నీ బతకాలి, వైవిధ్యం నిలవాలి. చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ఒకజీవి,మరో జీవి మను గడకు ప్రత్యక్షంగానూ సహకరిస్తుంది. మానవునితో పాటు సకల జీవుల మనుగడ జీవవైవిధ్యంపైనే ఆధారపడి ఉంది.అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగహన కలిగించడానికి 1992 సంవత్సరంలో కెన్యా దేశంలోని నైరోబి నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.ప్రతి ఏడాది వేర్వేరు సందేశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం.
మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రానురానూ అవి కనుమరుగైపోతున్నాయి. దాదాపు 200 కోట్ల సంవత్సరాల పూర్వం భూగోళం మండుతున్న అగ్నిగోళంలా ఉండేది. నేటికి దాదాపు వంద కోట్ల సంవత్సరాల క్రితం కాలక్రమేణ చల్లబడి ప్రాణకోటి ఆవిర్భవించింది. సూక్ష్మజీవి రూపంలో తొలిజీవి ప్లాజిల్లేట అనే ఏకకణ జీవి ప్రీ బయాటిక్ సూప్ అనే సముద్రం అడుగు భాగంలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు ఆ తర్వాత జంతుజాలం అవతరించాయి క్రమక్రమంగా ఉబయచరలు, పక్షులు పుట్టాయి. నేడు భూమ్మీద సుమారు 80 లక్షలు వృక్ష జంతుజాలం మనుగడ సాగిస్తున్నాయి. ఇందులో ఆధునిక మానవజాతి కూడా ఉంది. ఇప్పటివరకు 17 లక్షల జాతులను మాత్రమే గుర్తించగలిగారు. ప్రకృతిలోని అనంత జీవకోటిలో ప్రతిజీవి మనుగడకు ప్రత్యేక కారణం ఉంటుంది. జీవావరణంలోని ఏజీవి కూడా నిరుప యోగమైనది కాదు. ఏఒక్క జీవి అంతరించిన మొత్తం జీవావరణంపై ప్రభావం చూపుతుంది.
ప్రపంచంలోని పన్నెండు మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో పది శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో యాభై శాతానికి అర ణ్యాలు, డెబ్బయి శాతానికి పైగా నీటి వనరులు లుప్తమై పో యాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను మన జీవనశైలిలో భాగంగానే రూపుమాపబడ్డాయి. సముద్రతీరాలను అతలాకు తలమయ్యాయి. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాల్లో వన్యప్రాణుల్ని వేటాడి అంతమొందిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాము. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, ఇప్పటివరకు, సుమారు 1.75 మిలియన్ జాతులు గుర్తించబడ్డాయి, ఎక్కువగా కీటకాలు వంటి చిన్నజీవులు. వాస్తవానికి 13 మిలియన్ జాతులు ఉన్నాయని అంచనా.
జీవ వైవిధ్య సంరక్షణలో మన రాష్ట్రం సైతం ఆదర్శంగా నిలుస్తున్నది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు.. ఇలా అనేక ప్రత్యేకతల్ని రాష్ట్రం సొంతం చేసుకుంది.పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఏటీఆర్, ఖమ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాం తాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. రాష్ట్రంలో ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవిగా నిలుస్తున్నాయి. 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి.రాష్ట్రంలో ఎనిమిది వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి.ప్రాణహిత, శివ్వారం, ఏటూరు నాగారం, నాగార్జున సాగర్, శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మం జీరా, పోచారం.. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులు న్నాయి. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్-2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్-892 చదరపు కి.మీ. మేర పులుల అభ యారణ్యాలు విస్తరించి ఉన్నాయి. జాతీయపార్కులు. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిత వనస్థలి జాతీయపార్కు, హైదరాబాద్‌లో జవ హర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు, వరంగల్‌లో వన విజ్ఞాన కేంద్రం (మినీ జూ) ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌చెరువు బయోడైవర్సిటీ హెరిటేజ్‌సైట్‌గా ఉంది.
తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షిం చుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందు తున్నాం.. వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏవిధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది మ్రానవ సమాజ మంతా తెలుసుకోగలగాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవ సాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రయోజనం ఉంటుంది. వాటి ప్రాముఖ్యతను గుర్తించి సంరక్షణ చేస్తే భావితరాల మనుగడను అమ్మలా ఆదుకుంటుంది.రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుంద నడంలో ఎలాంటి సందేహం లేదు.
జీవ వైవిధ్యాన్ని హానిచేసే మానవ జీవన శైలిని మార్చు కోవాలి. భూతాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. జంతువుల్ని మొక్కల్ని పరిరక్షించుకోవాలి.సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు విరివిగా అవలంభించాలి. అంతరించే ప్రమాదం ఉన్న జాతులను రక్షించాలి.’ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది’. అప్పుడే జీవ వైవిధ్యం ఫలాలు రేపటి తరాలకు అందుతాయి.మానవ మను గడకు జీవవైవిధ్యం ఆధారం గనుక రక్షించవలసిన ఆవశ్యకత ప్రతి పౌరునిపైన ఉంది.వన నిర్మూలనకు అడ్డుకట్ట వేస్తూ నరికిన ప్రతి చెట్టుకు మరొక రెండుచెట్లు పెంచాలి. జీవ వైవిద్య పర్యా వరణ చట్టాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు శిక్షలను మరింత కఠినతరం చేయాలి. అక్రమ వృక్ష, జంతు రవాణా అరి కట్టాలి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలి. అటవీ వ్యవసాయయ తోటల పెంపకాన్ని అనుమతించ కూడదు. దేశంలోని 497 అభయారణ్యాలు 27 టైగర్ ప్రాజెక్ట్ పరిశోధనశాలలను ప్రత్యేకంగా నిర్వహించాలి. పర్యావరణ దినం, భూగోళం సంరక్షణ దినం, జీవ వైవిధ్య దినోత్సవాల సందర్భంగా ప్రజల్లో, విద్యాసంస్థల్లో ఆవగాహన కలిగించాలి. జీవ వైవిధ్య సదస్సులో జరిగిన తీర్మానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.అప్పుడే సకల ప్రాణకోటి మనుగడ నిరంతరాయంగా కొనసాగుతుంది.
(22 మే అంతర్జాతీయ జీవవైవిధ్య దినం)
గుండేటి యోగేశ్వర్ 9849254747
జీవవైవిద్యంతోనే మానవ మనుగడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES