నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ నీతా ఎం.అంబానీ కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కెఐఎస్‌ఎస్) హ్యూమనిటేరియన్ అవార్డును అందుకున్నారు. భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు నోబుల్ బహుమతి గ్రహీత శ్రీలంకకు చెందిన ప్రొఫెసర్ మోహన్ మునసింగే అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఐఐటీ, కేఐఎస్‌ఎస్, కెఐఎంఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంటాతో పాటు సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీతా అంబానీ రిలయెన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యసంరక్షణ, గ్రామాల్లో మార్పులు, మహిళా సాధికారత, క్రీడలను ప్రోత్సహించడం ద్వారా సమాజాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ అవార్డు తన ఒక్కరికే కాకుండా రిలయెన్స్ ఫౌండేషన్‌లో పని చేస్తున్న బృందానికి దక్కిన గౌరవమని నీతా అంబానీ తెలిపారు.
నీతా ఎం.అంబానీకి హ్యూమనిటేరియన్ అవార్డ్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



