Friday, October 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలురుబ్బురోలుతో భార్యను కొట్టి చంపిన భర్త

రుబ్బురోలుతో భార్యను కొట్టి చంపిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
విట్టల్ వాడి తండాకు చెందిన కిషన్ కు 25 సంవత్సరాల క్రితం పవర్ సవితతో వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబం మొత్తం గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతంలో చాయ్ కొట్టు పెట్టుకొని అక్కడే జీవిస్తుండేవారు. అప్పుడప్పుడు ఇంటిదగ్గర ఏదైనా కార్యక్రమాలు లేదా పండగలు ఉంటే విటల్వాడి తండాకు వచ్చేవారు. గత కొన్ని సంవత్సరాలుగా కిషన్ మద్యానికి బానిసై తన భార్యను అనుమానిస్తూ.. ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. అందాజ రెండోల క్రితం విటల్వాడి తండాలో గుడి పండుగ ఉన్నదని, ఆ కుటుంబం విటల్వాడి తండాకు వచ్చినారు.

ఈ నెల 23న రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో భర్త కిషన్ సవితను రుబ్బురాయి రోలుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావమైంది. ఈ గొడవను ఆపడానికి వచ్చిన తాండవాసులను కూడా కిషన్ గాయపరిచినాడు. రక్తపు మడుగులో కొనవుపిరితో ఉన్న సవితను స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మరణించింది. మృతురాలి అన్న జాదాపూల్ సింగ్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు బిచ్కుంద సీఐ రవికుమార్ పెద్దకోడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -