Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంపారతో భార్యను కొట్టి చంపిన భర్త

పారతో భార్యను కొట్టి చంపిన భర్త

- Advertisement -

పుస్తెలతాడు, డబ్బులు, సెల్‌ఫోన్లతో పరారీ
నవతెలంగాణ-చేగుంట

అర్ధరాత్రి భార్యను పారతో తల పగలగొట్టి చంపి, నగలు డబ్బు సెల్‌ఫోన్‌తో భర్త పరారైన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర గుడి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులుకు, చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి (33)తో 2015లో వివాహం అయింది. అప్పటినుంచి అతను ఇల్లరికం వచ్చి చేగుంటలోనే ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వరలక్ష్మి గృహిణి. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కాగా, శనివారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న వరలక్ష్మి తలపై త్రిమూర్తులు పారతో దాడి చేయగా ఆమె.. అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, ఆమె సెల్‌ఫోన్‌తోపాటు ఇంట్లో ఉన్న నగదును తీసుకొని పారిపోయాడు. కాగా, హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతురాలి అక్క ఉప్పరి సంతోషిని భర్త సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చైతన్యకుమార్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -