- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇద్దరు భార్యల చేతిలో భర్త హతమైన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో చోటుచేసుకుంది. ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంలో నివాసం ఉంటున్న కాల్య కనకయ్య (30) మద్యానికి బానిసై తరచూ తన ఇద్దరు భార్యలను వేధిస్తుండేవాడు. తాగిన మైకంలో మే 18న సొంత అక్కనే హత్య చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ.. భార్యలను, గ్రామస్థులను బెదిరిస్తుండేవాడు. సోమవారం రాత్రి కూడా గొడ్డలితో భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురుతిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలితో భర్తను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -