- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
భార్య చేతిలో భర్త హతమైన ఘటన గురువారం మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్ద పెండ్యాల గ్రామంలోని రాజారపు అశోక్ తండ్రి వెంకటయ్య (35) అతని భార్య యాదలక్ష్మి తరచూ కుటుంబ గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం అందాజ ఆరు గంటలకి రాజారపు యాదలక్ష్మి ఆమె భర్త ఆయన అశోక్ ని చీరతో ఉరివేసి చంపేసిందరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అశోక్ తండ్రి రాజారపు వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -