నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు.ఈసందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ… రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సదిమెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. మద్యం సేవించి గొడవలు పెట్టడంతో పాటు 2016 డిసెంబర్ 2న భార్యను దారుణంగా కొట్టాడని, టార్చ్‌లైట్‌తో దాడి చేసి గాయాలు చేశాడని తెలిపారు.
వేధింపులు భరించలేక బాధితురాలు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు సదిమెల రామచంద్రం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం అప్పటి ఎస్.ఐలు చిట్టిబాబు, ప్రవీణ్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా, ఎస్.ఐ గణేష్, సీఎంస్ ఎస్.ఐ శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ లు 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందితుడు రామచంద్రంపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ తెలిపారు.