Saturday, October 11, 2025
E-PAPER
Homeక్రైమ్భార్య గొంతు కోసి పరారైన భర్త

భార్య గొంతు కోసి పరారైన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉన్న భార్యను భర్త గొంతు కోసి హతమార్చాడు. మంజుల, శంకర్ దంపతులు ముంబై నుంచి హైదరాబాద్‌కు రెండు నెలల క్రితమే వలస వచ్చారు. కాగా మంజుల వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త శంకర్ ఆమెతో తరచూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో బంధువుల ఇంట్లో ఉన్న భార్యను కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -