Wednesday, December 31, 2025
E-PAPER
Homeబీజినెస్వెల్త్‌ హబ్‌గా హైదరాబాద్‌

వెల్త్‌ హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -

– ఎంకె వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా
హైదరాబాద్‌ :
భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న అధిక సంపద కేంద్రంగా హైదరాబాద్‌ అవతరిస్తోందని ఎంకె గ్లోబల్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు చెందిన ఎంకె వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఆధారంగా బలపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థ ఈ పరిణామానికి ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయని ఎంకె వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ వైష్‌ తెలిపారు. ఈ నిర్మాణాత్మక ధోరణులు హైదరాబాద్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టికి కీలక మార్కెట్‌గా నిలబెడుతున్నాయన్నారు. ఈక్విటీలు, ప్రయివేటు మార్కెట్లు, రియల్‌ అసెట్స్‌, ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో విస్తృత అవకాశాలు అందిస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -