- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 2004-2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నగర అభివృద్ధి సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఓఆర్‌ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రోరైలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. 2014 నుంచి హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేంద్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణకు చేసింది శూన్యం’’ అని అన్నారు.
- Advertisement -



