Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవైవిధ్యానికి ప్రతీక హైదరాబాద్‌

వైవిధ్యానికి ప్రతీక హైదరాబాద్‌

- Advertisement -

– గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారతదేశంలోని వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రతీకలాగా హైదరాబాద్‌ ఉందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌ భవన్‌లో జమ్ము, కాశ్మీర్‌, లఢక్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకులను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌ పేరుతో వివిధ భాషలు, విద్య, పర్యాటక సంబంధాలను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు హైదరాబాద్‌ వంతెనలా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -