– దేశంలోనే ఫిల్మ్ మేకర్లకు ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ మారాలి : మంత్రి కోమటిరెడ్డి
– హైదరాబాద్ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ అంటేనే సినిమా అనీ, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ చైర్మెన్ దిల్ రాజు, ఎండీ సిహెచ్ ప్రియాంక, నిర్వాహకులు ఉమా మహేశ్వరరావు ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెద్ద సినిమాలు ఒక వైపు, షార్ట్ ఫిల్మ్‌లు మరో వైపు తీస్తుంటారని చెప్పారు. కొత్త టాలెంట్ ఎక్కువగా ఇక్కడినుంచే వస్తుందన్నారు. షార్ట్ ఫిల్మ్‌లు యువతకు స్వేచ్ఛనిస్తాయని అన్నారు. పెద్ద స్థాయిలో ఉన్న చాలామంది ఫిల్మ్ మేకర్లు మొదట షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలుపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. మంచి టాలెంట్‌కు అవకాశం రావాలనీ, యువ ఫిల్మ్ మేకర్లు ముందుకు రావాలని కోరారు. దేశంలోనే ఫిల్మ్ మేకర్లకు రాష్ట్రంగా తెలంగాణ మారాలని చెప్పారు. అనుమతులు సులభంగా ఉండాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఫిల్మ్ మేకర్లు పాల్గొన్నారనీ, ఎనిమిది రాస్ట్రాల నుంచి కథలు చూస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని చెప్పారు. అవార్డు వచ్చినా రాకున్నా అందరికీ నచ్చేలా షార్ట్ ఫిల్మ్‌లను తీయాలని సూచించారు.
హైదరాబాద్ అంటేనే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



