Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆసరా పెన్షన్ పెంపుకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్

ఆసరా పెన్షన్ పెంపుకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ పెంపుకై ఈ నెల13న చలో హైదరాబాద్ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం తాడిచర్ల,మల్లారం గ్రామాల్లో వికలాంగులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు వృద్ధులకు రూ.2వేల నుంచి రూ.4 వేలు,వితంతువులకు రూ. 2 వేల నుంచి రూ.4వెలు,వికలాంగులకు రూ.4 నుంచి రూ.6 వేలు,కండరాల క్షీణిత బాధితులకు రూ.15 వేలు పెన్షన్ పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ సమీక్ష సమావేశానికి రావడం జరిగిందమన్నారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం శంకరన్న, మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ, కాటారం మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ, ఖమ్మంపల్లి సందీప్, మంథని మధుకర్, గడ్డం లక్ష్మయ్య, సందీప్ మాదిగా, కన్నవేణ లక్ష్మణ్ రాజయ్య, రాజేందర్, బొంతల కుమార్, శరత్, ఇందారపు సుమన్, కేసారపు వంశీ, విజయకుమార్, కుసుమ రవి, కందికొండ నరసయ్య, మంతెన సమ్మయ్య, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img