Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశాస్త్రీపురంలో హైడ్రా కూల్చివేతలు

శాస్త్రీపురంలో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన అధికారులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని శాస్త్రీపురంలో హెచ్‌ఎండీఏ పార్కు స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు బుధవారం ఉదయం కూల్చివేశారు. సర్వే నెంబర్‌ 134/20లో 6500 గజాల హెచ్‌ఎండీఏ పార్కు స్థలానికి కేటాయించింది. కొన్నేండ్ల క్రితం ఈ స్థలంపై కన్నేసిన స్థానిక కబ్జారాయుళ్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ పార్కు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ప్లాట్లుగా విక్రయించి కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ విషయాన్ని గతంలో తహసీల్దార్‌, ఆర్డీఓ దృష్టికి స్థానికులు తీసుకెళ్లినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఏమీ చేయలేకపోయారు. అయితే ఇటీవల స్థానికులు హైడ్రా ప్రజావాణి కార్యక్ర మాల్లో పార్కుస్థలం కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. దాంతో రంగం లోకి దిగిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తహసీల్దార్‌, ఆర్డీఓ అధికారులను సమన్వయం చేసి పూర్తిగా సర్వే చేయించారు. ఆ స్థలం హెచ్‌ఎండీఏ పార్కు స్థలంగా గుర్తించారు. దాంతో బుధవారం ఉదయం 4 గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ పార్కు స్థలంలో నిర్మించిన నాలుగు భారీ భవనాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కబ్జారాయుళ్ల నుంచి నిరసన, దాడులు జరిగే అవకాశం ఉండటంతో రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు జేసీబీల సాయంతో పార్కు స్థలంలో నిర్మించిన అన్ని కట్టడాలను కూల్చివేశారు. తర్వాత హైడ్రా ఆధ్వర్యంలో ఆ పార్కు చుట్టూ ఫినిషింగ్‌ ఏర్పాటు చేసి పార్కు స్థలం అని బోర్డు పెట్టారు. చాలా కాలం తర్వాత మళ్లీ పార్కు స్థలం తమకు కేటాయించినందుకు స్థానికులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -