Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.4 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

రూ.4 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

- Advertisement -

మీర్‌పేట్‌లో కబ్జాకు గురైన ప్రాంతంలో ఫెన్సింగ్‌, బోర్డు ఏర్పాటు

నవతెలంగాణ-మీర్‌పేట్‌
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ నందిహిల్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌-8లో రూ.4 కోట్ల 20 లక్షల విలువైన 2100 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు.ఈ పార్కు స్థలంలో సుమారు 600 గజాలను ఓ పార్టీ నాయకుడు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా కబ్జా చేసినట్టు కాలనీవాసులు గుర్తించారు. ఈ మేరకు కొందరు కాలనీవాసులు కాలనీ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు స్పందించి ఆ స్థలంలో సర్వే నిర్వహించారు. కబ్జాకు గురైన పార్కు స్థలం చుట్టూ బుధవారం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ పార్కు స్థలం అని స్పష్టంగా పేర్కొంటూ బోర్డు పెట్టారు. హైడ్రా అధికారుల చర్యలతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -