Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.1100 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా

రూ.1100 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా

- Advertisement -

– నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు
– దాదాపు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
నవతెలంగాణ – సిటీబ్యూరో, బంజారాహిల్స్‌

నగరంలో పలు చోట్ల ఆక్రమణలను శుక్రవారం హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. ఆ భూమి విలువ రూ. 750 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 7.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా.. రంగారెడ్డి జిల్లాలో ప్రజా వసరాలకు ఉద్దేశించిన 680 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ సందర్భంగా శుక్రవారం హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వివరాలను వెల్లడించారు.

షేక్‌పేట్‌ మండలంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10లో పార్థసారథి అతని కుమారుడు విజరు కలిసి తప్పుడు (ఫేక్‌ సర్వే) నెంబర్‌ (403/52)తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేశారు. అక్కడ 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమి తమదేనంటూ కబ్జా చేసిన పార్థసారథి అతని కుమారుడు విజరు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీలి రంగు రేకులకు తెల్ల రంగు వేశారు. ల్యాండ్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేసి, సీసీ కెమెరాలు అమర్చి పెంపుడు కుక్కలు, బౌన్సర్లను పహారాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ భూమిలోకి ఏ ఒక్కరూ వెళ్లకుండా ఉండేలా సొంత భూమిలా కబ్జా చేశారు. ప్రభుత్వ సెలవుల సమయంలో అక్కడ నిర్మా ణాలు చేపట్టడాన్ని గమనించిన వాటర్‌ బోర్డు, రెవెన్యూ విభాగం అధికారులు పోలీసులకు సమా చారం ఇచ్చారు. జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ కోర్టుకెక్కిన పార్థసారథి ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్థానికులను బెదిరించేవాడు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకున్నాడు. ప్రభుత్వ భూమినే అడ్డాగా చేసుకుని మద్యం సేవించి పలువురిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్థసారథిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పార్థసాథిని విచారిస్తే క్రిమినల్‌ రికార్డు వెలుగు చూసిందని కమిషనర్‌ తెలిపారు. వాస్తవంగా 403 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్‌ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ అవడంతో ఆన్‌ రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ అతను క్లెయిమ్‌ చేస్తున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య పార్థసారథి వేసిన ఫెన్సింగ్‌తో పాటు లోపలున్న షెడ్డులను హైడ్రా తొలగించి ఐదు ఎకరాల ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా నేతృత్వంలో 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

పార్కు స్థలంలో ఆక్రమణ..
మేడ్చల్‌ మల్కాజగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం గాజులరామారం మహాదేవపురంలో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించి శుక్రవారం చర్యలు తీసుకుంది. 3.50 ఎకరాల మేర పార్కు స్థలంలో ఆక్రమణలను తొలగించింది. మేడ్చల్‌ విలేజ్‌ ఏజీ ఆఫీసు ఉద్యోగులకు చెందిన హౌసింగ్‌ సొసైటీ లే ఔట్‌లో కూడా పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన 3 ఎకరాల ల్యాండ్‌ కబ్జాకు గురి కాగా హైడ్రా ఆక్రమణలను తొలగిం చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్‌ మండలం తట్టి అన్నారం విలేజ్‌ శ్రీలక్ష్మి గణపతి కాలనీలోని 680 గజాల మేర విస్తరించిన పార్కు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఇందులో 270 గజాల ప్లాట్‌ తనకుందంటూ పార్కు స్థలంలోనే పాగా వేసేందుకు ప్రయత్నించగా స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో విచారించిన దరిమిలా పార్కు స్థలాన్ని మొత్తం కాపాడి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -