Tuesday, September 30, 2025
E-PAPER
Homeసినిమాఘనంగా 'హైలెస్సో' ప్రారంభం

ఘనంగా ‘హైలెస్సో’ ప్రారంభం

- Advertisement -

సుడిగాలి సుధీర్‌ హీరోగా ఓ కొత్త సినిమా రూపొందనుంది. ప్రసన్న కుమార్‌ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వజ్ర వారాహి సినిమాస్‌ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.1. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ‘హైలెస్సో’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. హీరో నిఖిల్‌ టైటిల్‌ను లాంచ్‌ చేశారు. నిర్మాత బన్నీ వాసు స్క్రిప్ట్‌ అందజేశారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్‌ రమేశ్‌ కెమెరాను ఆన్‌ చేయగా, ముహూర్తపు షాట్‌కు వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు ప్రసన్న కుమార్‌ స్వయంగా యాక్షన్‌ చెప్పారు.

ఈ సినిమాలో నటాషా సింగ్‌, నక్ష శరణ్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్‌, గెటప్‌ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: శివ చెర్రీ – రవికిరణ్‌, దర్శకత్వం: ప్రసన్న కుమార్‌ కోట, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, డీఓపీ : సుజాత సిద్దార్థ్‌, ఎడిటర్‌: ఛోటా కె ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: బ్రహ్మ కడలి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, రచయిత: చింతా శ్రీనివాస్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: ఉదయ్‌ నందిపాటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -