Sunday, June 15, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్నేను కోతిని

నేను కోతిని

- Advertisement -

జమీందారు తోటలో వేపచెట్టుమీద ఒక కోతి నివసించేది.
ఒకరోజు జమీందారు తోటలో వెళ్తున్నపుడు వెనుకగా పాము రావడం చెట్టుమీద కోతి చూసింది. వెంటనే కోతి జమీందారు వైపు చూస్తూ గట్టిగా అరిచింది. కానీ జమీందారు పట్టించుకోలేదు.
జమీదారును పాము కాటువేయకుండా ఎలాగైనా కాపాడాలనుకొని ఒక్కసారిగా చెట్టుపైనుండి దూకి పామును పట్టుకొని లాగింది. జమీందారు చూసి అక్కడున్న కర్రతో పామును కొట్టి చంపాడు.
ఈలోగా జమీందారు కుటుంబ సభ్యులందరూ జరిగింది చూశారు. జమీందారుతో పాటు ఆ ఇంటివారందరూ కతజ్ఞతగా చేతులు జోడించారు. జమీందారు దగ్గరకెళ్ళి జేబులోనున్న సెల్‌ ఫోన్‌ కావాలంటూ సైగ చేసింది కోతి
”ఈ వేళ నా ప్రాణం కాపాడావు. ఇకమీదట నీవేమి అడిగినా ఇస్తాను” అంటూ సంతోషంతో ఇచ్చాడు.
చిట్టి కోతి దగ్గరకెళ్ళి ఆ సెల్‌ ఫోన్‌ ఇస్తూ ”నిన్ను యజమాని కొడుకులా పెంచాలనుకొన్నాను. అనుకోకుండా ఆవకాశం దొరికింది. ఆ యజమాని కొడుకులా నీవూ సెల్‌ ఫోన్‌ నందు వీడియో గేమ్స్‌ చూడు” అంది తల్లి కోతి.
సెల్‌ ఫోన్‌ వీడియో గేమ్స్‌ ఆడుతూ సంతోషంతో అరుస్తున్న ఆ చిట్టి కోతిని చూసి తల్లి కోతి మురిసిపోయింది. ఒక రోజు తరువాత ఆ సెల్‌ ఫోన్‌ తీసుకొని యజమాని దగ్గర ఉంచితే ఛార్జింగ్‌ పెట్టి, రీ చార్జ్‌ చేసి మరికొంత సమయం తరువాత చెట్టు దగ్గర పెట్టేవాడు.
కొన్ని రోజులకు చిట్టి కోతికి కళ్ళ సమస్య తోపాటు వింత వ్యాధులు వచ్చాయి. పక్క వీధిలో మర్రిచెట్టుమీదున్న కోతి వైద్యుడు దగ్గరకు తీసుకెళ్లింది.
చిట్టికొతిని అన్ని విధాలా పరీక్షించాడు కోతి వైద్యుడు
”నీది మానవ జన్మమా, లేక కోతి జన్మమా. మానవులలాగా తమ పిల్లలకు సెల్‌ ఫోన్‌ ఇచ్చి వారి ఆరోగ్యం చెడిపినట్లు నీ చిట్టికోతికి సెల్‌ ఫోన్‌ ఇచ్చావు. నీ చిట్టికోతి చెట్లపై ఆడుకోవడం మానుకొంది. చివరకు అనారోగ్యం తెచ్చుకొంది” కోపంగా కోతి వైద్యుడు అన్నాడు.
”నేను తప్పు చేశాను క్షమించండి. మానవులలాగా తన పిల్ల్లలకు వీడియో గేమ్స్‌ చూడటానికి సెల్‌ ఫోన్‌ ఇవ్వను. నాది మానవజన్మ కాదు. నేను కోతినే. నేను కోతి లాగా నడచుకొంటాను. ఇకమీదట నా చిట్టికోతికి సెల్‌ ఫోన్‌ ఇవ్వను. నా కోతిని గుణపరచండి” కన్నీళ్లతో అంది తల్లి కోతి.
– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -