- Advertisement -
పగిలిన గుండెలు
హృదయం ద్రవించే దశ్యాలు
రోజులు గడుస్తున్నా
మసిబారుతున్న
పసి బుగ్గలు
రొట్టెముక్క కోసం
ఆశగా చూస్తున్న కన్నులు
కనుచూపు మేర
కానరాని నవ్వులు
బూడిదైపోతున్న బతుకులు
గాల్లో తేలుతున్న
నిర్దోషుల ఆర్తనాదాలు
అగ్ర రాజ్య అహంకారాన్ని చూడలేక ఉదయించలేనంటున్న సూరీడు
శవాల కుప్పలపై
వెన్నెల కురిపించలేక
తల్లడిల్లుతున్న జాబిలమ్మ
గాజా వీధులు ఇప్పుడు
కేవలం శవాల దిబ్బలు
ఆ కమురు వాసనను
చమురుగా మార్చి
దోచుకో చూస్తున్నారు
శాంతి ఓ ప్రశ్నగా మిగిలిన వేళ
గాజాకు మన గళం కలుపుదాం
ఆ దేశాన్ని మింగుతున్న
తిమింగళాలను తరిమి కొట్టే వరకు
మన స్వరాన్ని వారికి
చేయూతగా ఇద్దాం
శాంతి కావాలంటూ
గట్టిగా నినదిద్దాం
– శరత్ సుదర్శి, 7386046936
- Advertisement -