Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌కు రావడం ఆనందంగా ఉంది

భారత్‌కు రావడం ఆనందంగా ఉంది

- Advertisement -

రెండు దేశాలకూ అద్భుతమైన అవకాశాలు : భారత్‌కు చేరుకున్న అమెరికా రాయబారి

న్యూఢిల్లీ : భారత్‌- అమెరికా దేశాలకు మున్ముందు గొప్ప అవకాశాలున్నాయని భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితులైన సెర్జియో గోర్‌ వివరించారు. ఆయన ఇప్పటికే భారత్‌కు చేరుకు న్నారు. భారత్‌కు వచ్చిన అనంతరం సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు. ”భారత్‌కు మళ్లీ రావడం ఆనందంగా ఉంది. మన రెండు దేశాల ముందు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు. రష్యా చమురును దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ టారిఫ్‌లు విధించే అంశంలో అమెరికా-భారత్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం విదితమే. ఇలాంటి సమయంలోనే గోర్‌ భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

సెర్జియో గోర్‌ గత నవంబర్‌లో అమెరికా రాయబారిగా అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమం అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌తో ఉన్న సంబంధాల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సెర్జియో గోర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. కాగా ప్రమాణస్వీకారానికి ముందు గతేడాది అక్టోబర్‌లోనే గోర్‌ భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌లను కలిశారు. గతేడాది ఆగస్టులోనే ట్రంప్‌ యంత్రాంగం సెర్జియో గోర్‌ను భారత్‌కు తదుపరి అమెరికా రాయబారిగా, అలాగే దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలపై ప్రత్యేక దూతగా నామినేట్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -