వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం
అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మురళి నాయక్ కృతజ్ఞతలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు : మహబూబాద్ జిల్లా పేద రైతు బిడ్డలు అన్ని విధాల ఆదుకుంటానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ తెలిపారు. గురువారం మహబూబాద్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సహకారంతో వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ నెల్లికుదురు మండలాన్ని అన్ని రంగాలుగా అన్ని విధాలుగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నందున అతనికి కృతజ్ఞతలు మండల ప్రజల నుంచి ధన్యవాదములు అని తెలిపారు.
అంతేకాకుండా నేడు మండల ప్రజలకు రైతులకు వ్యవసాయ రంగానికి కావాల్సిన ఎరువులు విత్తనాలు కావాలని వారిని ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కాస లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని మంత్రికి అందించడంతో వెంటనే స్పందించిన మంత్రి మండల ప్రజలనే కాదు మహబూబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. రైతు రుణమాఫీ రైతుల పంటకు మద్ద ధర సన్నధాన్యానికి బోనస్ ఇలా ఎన్నో రకాలుగా రైతును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు యూరియా లాంటి మందు బస్తాలు ఆగ్రోస్ రైతు కేంద్రాలకు ఇవ్వాలని తెలిపామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెల్లికుదురు మండలాన్ని అన్ని విధాలుగా నా వంతు సహకారాలు అందిస్తానని తెలిపారని అన్నారు దీంతో వెంటనే వారికి కాంగ్రెస్ పార్టీ మండల ప్రజల పక్షాన హర్ష వ్యక్తం ప్రకటించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల శంకర్ ఉన్నారు.