హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటించారు.
-పవన్ కళ్యాణ్ అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే ఇండస్ట్రీలో డైరెక్టర్స్, హీరోలు చాలామంది పర్సనల్‌గా ఫోన్ చేశారు. మెసేజెస్ పెట్టారు. ఈ సక్సెస్‌ని మాతో పాటు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అలాగే వరుసగా విజయాలు రావడమూ ఆనందాన్నిచ్చింది.
-ఈ సినిమా వింటేజ్ చిరంజీవిని చూసి అందరూ మెస్మరైజ్ అయ్యారు. ఆయనలో నేచురల్‌గా ఒక టైమింగ్ ఉంటుంది. అలాంటి కథతో ఆయన్ని ప్రజెంట్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందని ఫీల్ అయ్యాను. ఈ రోజు అదే జరిగింది. అన్ని జనరేషన్ ఆడియన్స్ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
-చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించబోతున్నారంటే కచ్చితంగా చాలా అంచనాలు ఉంటాయి. అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయడం కూడా పెద్ద టాస్క్. థియేటర్స్‌లో చిరంజీవి, వెంకటేష్ సీన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంజాయ్ చేస్తున్నారు.
-రాజమౌళి తర్వాత వరుసగా 9 విజయాలు అందుకున్న దర్శకుడిగా ప్రశంసిస్తున్నారు. నిజానికి ఇది నాకు కాస్త కృషియల్ ఫేజ్. ఈసారి టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాను. అది కూడా మంచి ఎంటర్‌టైనర్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా? అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు(నవ్వుతూ). సినిమా ఇప్పటికే రూ.300 కోట్లు దాటింది.. నెక్స్ట్ టార్గెట్ 400 కోట్లు దాటాలని ఆశిస్తున్నా.
రూ.400 కోట్లు దాటాలని ఆశిస్తున్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



