Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeసినిమానాకు నేనే ఆయుధం..

నాకు నేనే ఆయుధం..

- Advertisement -

ఆర్కే సాగర్‌ తాజాగా నటించిన ‘ది 100’ చిత్రం ఈనెల 11న థియేటర్స్‌లోకి రానుంది. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్‌ కార్ప్‌, ధమ్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై రమేష్‌ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా హీరో పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.
‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం’ అనే విక్రాంత్‌ ఐపీఎస్‌ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే రూల్‌ పెట్టుకుంటాడు. కానీ ఆత్మరక్షణ కోసం, తనని తాను ఆయుధంగా చూసు కోవడం ప్రారంభిస్తాడు. వ్యవస్థలోని శక్తివంతమైన వ్యక్తుల మద్దతుతో క్రూరమైన దొంగల ముఠా వల్ల అతని జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదు రౌతుంది. అతని సొంత డిపార్ట్‌మెంట్‌ కూడా అతనిపై ఆరోపణలు చేసి, చివరికి సస్పెండ్‌ చేస్తుంది. ఒకప్పుడు ఆయుధం తీసుకెళ్లనని శపథం చేసిన వ్యక్తి ఆయుధం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి వస్తాడు. మిషా నారంగ్‌ తన లవ్‌ ఇంట్రస్ట్‌గా కనిపించి కథకు రొమాంటిక్‌ టచ్‌ను యాడ్‌ చేసింది. దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ సస్పెన్స్‌, థ్రిల్స్‌ నిండిన ఇంటెన్స్‌, గ్రిప్పింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించాడు. శ్యామ్‌ కె నాయుడు సినిమా టోగ్రఫీ, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ పవర్‌ ఫుల్‌ సంగీతం యాక్షన్‌ని మరింత ఎలివేట్‌ చేసింది. ట్రైలర్‌ థియేటర్‌ విడుదలకు ముందే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad