Sunday, September 21, 2025
E-PAPER
Homeకవితసహించే పరిచారిని కాను

సహించే పరిచారిని కాను

- Advertisement -

దశాబ్ద కాలాల క్రింద
ఘోషించిన ఊహ ప్రేయసిల ఆత్మల్ని శోషించుకొని,
కణాల నిర్వాణ వాంఛల
ప్రియత్వం నుండి ఎగసిపడే
రమ్యాల్ని విధ్వంసం చేసి
నర నరాన ఫెమినిజాన్ని నింపి-
అగమ్య సద్యోగర్భంలో
వెంట వెంటనే మళ్లీమళ్లీ పుట్టి,
వేల శక్తి రూపాలై నవకాండల్ని సష్టిస్తాను.
నేనంటే-
మీరనుకునే శంగార మాంసపు ముద్దల్ని కాను
రగులుతున్న ఎర్రటి అగ్నిగోల ఛాయల్ని !
ప్రబంధ కవుల స్మశానం వద్ద
నా ఎజెండా ప్రస్తావించి,
ఆమెలో అతని ప్రథల్ని తీసేసి
భవిష్యత్‌ లో చరిత్ర లేకుండా చేస్తాను
ఎవరికోసమో, ఎవరి వలనో
కశించి, సహించే పరిచారిని కాను
మళ్లీ –
రామాయణ, భారతాలను మొదలెట్టాల్సి వస్తే
ఇప్పుడు నేను- ప్రాచీన సీతను కాను,
ప్రబంధ కన్యను కాను !
ప్రతిధ్వనించే ఆధునిక పాంచాలిని !!

  • గడ్డం లింగస్వామి, 9010081146
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -