– ఎమ్మెల్యే కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్
”నేను రాజీనామా చేయడం లేదు” స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఆ తర్వాత తన కార్యాచరణ, ప్రణాళిక ఉంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23లోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ సభాపతి నుంచి తనకు నోటీసులు అందినట్టు కడియం తెలిపారు. వివరణ ఇచ్చేందుకు సమయం కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇదిలావుండగా, తాను తీసుకునే ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, ప్రజలందరి సహకారం ఉన్నదని స్పష్టం చేశారు. రోజుకు అనేక అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, ఇదే తరహాలో పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండి.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామపంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సూచించారు. గ్రామాలలో సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏకగ్రీవమైతే రూ.10లక్షలు, ఒకవేళ గ్రామంలో ఒకేతాటిపై నిలిచి పార్టీలకతీతంగా సర్పంచ్‌గా ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా.. అదనంగా తన సొంతంగా రూ.15లక్షలు కలిపి రూ.25లక్షలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
నేను రాజీనామా చేయడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



