Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేను రాముడిని,తను నా సీత..

నేను రాముడిని,తను నా సీత..

- Advertisement -

హీరో రోషన్‌ కనకాల తన సెకండ్‌ మూవీ ‘మోగ్లీ 2025’తో వస్తున్నారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. బుధవారం హీరో ఎన్టీఆర్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. ‘హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునే యువకుడు మోగ్లీ. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతని ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. రామ, సీత ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుంది. వీరి సంతోషంలో రాక్షసుడు లాంటి పోలీస్‌ ఆఫీసర్‌ ఎంటరౌతాడు. దీంతో అంతా యుద్ధ భూమిగా మారుతుంది. దర్శకుడు సందీప్‌ రాజ్‌ టీజర్‌ను అద్భుతంగా కట్‌ చేశారు.

రామ, సీత లాగా హీరో, హీరోయిన్లను, రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణలా ప్రజెంట్‌ చేశారు. రోషన్‌ కనకాల అద్భుతంగా కనిపించాడు. అతనికి జోడీగా నటించిన సాక్షి మదోల్కర్‌ చెవిటి, మూగ అమ్మాయి సహజంగా నటించింది. విలన్‌గా బండి సరోజ్‌ కుమార్‌ ఇంటెన్స్‌గా కనిపించగా, హీరో స్నేహితుడిగా వైవా హర్ష తన కూల్‌ హ్యుమర్‌తో అలరించాడు. స్ట్రాంగ్‌ కాన్సెప్ట్‌, అద్భుతమైన విజువల్స్‌తో వచ్చిన ఈ టీజర్‌ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం డిసెంబర్‌ 12న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -