Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాన్సెప్ట్‌ నచ్చి రిలీజ్‌ చేస్తున్నా

కాన్సెప్ట్‌ నచ్చి రిలీజ్‌ చేస్తున్నా

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌, రైటర్‌- డైరెక్టర్‌ కశ్యప్‌ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్‌, పిఓవి స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ నిర్మిస్తున్నాయి. పవన్‌ సాదినేని సమర్పిస్తున్నారు. థియేట్రికల్‌ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’టీజర్‌ చాలా నచ్చింది. తర్వాత మొత్తం కాన్సెప్ట్‌ చెప్పారు. నాకు చాలా నచ్చింది. మంచి హ్యూమర్‌ ఉన్న సినిమా ఇది.

దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్‌ చేయడానికి ముందుకు వచ్చాం.అయితే దానికి కూడా కండిషన్స్‌ అప్లై. ఎందుకంటే ఏప్రిల్‌ 30కి ‘పెద్ది’ సినిమా ఆల్రెడీ అనౌన్స్‌ అయింది. ఆ సినిమా వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌ ఉంటుంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్‌ మేమే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్‌ అప్లై అని చెప్పాము. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని అన్నారు. ‘దిల్‌ రాజు ఈ సినిమాని రిలీజ్‌ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన టచ్‌ చేసిన ఏ సినిమా అయినా అద్భుతంగా ఆడుతుంది.

ఆయన ఏది పట్టుకుంటే అది గోల్డ్‌ మైన్‌. ఈ సినిమా కూడా గోల్డ్‌ మైన్‌ అవుతుందని ఆయన ముందుగానే ఊహించారు. మాలాంటి యంగ్‌ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్‌ చేస్తున్న ఆయనకు థ్యాంక్స్‌. ఈ సినిమాకి మిగతా బిజినెస్‌ కూడా చాలా బాగుంది. మ్యూజిక్‌ రైట్స్‌ జీ వాళ్లే తీసుకున్నారు. ఓటీటీ కూడా లాక్‌ అయింది. థియేటర్స్‌లో కూడా అద్భుతంగా ఆడుతుంది’ అని ప్రొడ్యూసర్‌ భాను కిరణ్‌ చెప్పారు. పవన్‌ సాదినేని మాట్లాడుతూ,’దిల్‌ రాజుకి స్పెషల్‌ థాంక్యూ. ఆయనకి టీజర్‌ కాన్సెప్ట్‌ నచ్చి ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నారు. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది’ అని తెలిపారు.

దిల్‌రాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -