నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టే గెలుస్తుంది
అదే నా స్పెషల్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తా
ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ – బంజారాహిల్స్
తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని, అదే తన స్పెషల్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు కానీ తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని జహీరానగర్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటే ప్రజలంతా ఉన్నారని తెలిపారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్‌లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం స్వయంగా తాను ప్రచారం చేస్తానన్నారు.



