Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంనా బిడ్డను పోషించలేకపోతున్నా..

నా బిడ్డను పోషించలేకపోతున్నా..

– గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించిన తల్లి
– వైకల్యంతో బాధపడుతున్న పర్శసాయి కుటుంబాన్ని సందర్శించిన అధికారులు
నవతెలంగాణ- జనగామ కలెక్టరేట్‌

జనగామలోని కుర్మ వాడకు చెందిన పర్శ సాయిమల్లయ్య, లక్ష్మి అనే దంపతులు తమ చిన్న కుమారుడు సాయి.. మానసిక, శారీరక వైకల్యంతో బాధ పడుతున్నాడని, తమ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున కుమారున్ని పోషించలేకపోతున్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటూ సోమవారం గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులను పర్శ సాయి నివాసానికి వెళ్లి వారి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం జనగామ ఆర్డీఓ గోపీరామ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు.. పర్శ సాయి ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని గమనించి, ప్రస్తుతం వారు ఉంటున్న నివాసం, ఆర్ధిక పరిస్థితి గురించి కలెక్టర్‌కి వివరించారు. వారికున్న స్థలంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు తెలిపారు. అలాగే రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతో పాటు సాయికి మెరుగైన వైద్య సౌకర్యం కోసం నిమ్స్‌కి పంపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img