Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనీ కబ్జాల చిట్టా విప్పితే తట్టుకోలేవ్‌..

నీ కబ్జాల చిట్టా విప్పితే తట్టుకోలేవ్‌..

- Advertisement -

– నోటికొచ్చింది మాట్లాడటం మానేసి ప్రజా సేవ చేయడం నేర్చుకో..
– మంత్రి పదవులను ఎంతకమ్ముకున్నావో అందరికీ తెలుసు
– నగల షాపులు, బట్టల దుకాణాలను వదల్లేదు
– హరీశ్‌రావు, కేటీఆర్‌ను జైలుకు పంపించాలని రేవంత్‌ రెడ్డితో కలిసి కుట్ర
– కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్‌
నవతెలంగాణ – కూకట్‌పల్లి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ‘జాగృతి జనం బాట’ పర్యటనలో భాగంగా నగరంలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత కేసీఆర్‌పై కవిత ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ”కవిత నీ కబ్జాల చిట్టా విప్పితే తట్టుకోలేవు.. నీ లాంటి కుక్కలను చాలా చూశాను.. నీలాంటోళ్లకు ఎవడూ భయపడరు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నీ అక్రమాలు, నీ భర్త అక్రమాలు బయట పెడితే తట్టుకోలేవు.. ఇక నుంచైనా నోటికొచ్చింది మాట్లాడటం మానేసి ప్రజా సేవ చేయడం నేర్చుకో.. నీవు బట్టల షాపులు, బంగారం షాపులు సైతం వదల్లేదు.. మంత్రి పదవులను ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు.. నీ ఊర్లోనే నీకు గెలవడం చేతకాలేదు..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని, కేటీఆర్‌ను అరెస్టు చేయించి ఆ తరువాత దోచుకుతినడానికి కవిత ప్లాన్‌ చేశారని ఆరోపించారు. కవిత భర్త అక్రమాల చిట్టా తన వద్ద ఉందన్నారు. కవిత లిక్కర్‌ క్వీన్‌ అని.. అందుకు ఆమె ఇంట్లో పెరుగుతున్న పెంపుడు కుక్కే నిదర్శనమన్నారు. ఆ కక్కకు ఆమె విస్కీ అని పేరు పెట్టారని.. దీన్నిబట్టే ఆమె లిక్కర్‌ వ్యాపారం గురించి అర్థం చేసుకోవచ్చునన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ను జైలుకు పంపించాలని రేవంత్‌ రెడ్డితో కలిసి కుట్ర పన్నుతున్నట్టు తమకు తెలియదనుకున్నావా? అని ప్రశ్నించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసిన అక్రమాలు బయటకు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ దేవుడని, ఆయన పేరును, పార్టీని సర్వనాశనం చేయాలని కవిత చూడటం దుర్మార్గమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -