Tuesday, October 28, 2025
E-PAPER
Homeసినిమాఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ చేశా..

ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ చేశా..

- Advertisement -

సుధీóర్‌ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌, శివిన్‌ నారంగ్‌, అరుణ అగర్వాల్‌, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్‌, నిఖిల్‌ నందా నిర్మిం చారు. నవంబర్‌ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శిల్పా శిరోధ్కర్‌ మీడియాతో ముచ్చటించారు.
‘బ్రహ్మ’ తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగులోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో శోభ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే రిచ్‌ అయిపోవాలి అనుకునే క్యారెక్టర్‌. ఈ క్యారెక్టర్‌ ప్లే చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌ నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్‌ క్లియర్‌ విజన్‌, సపోర్ట్‌తో ఈ క్యారెక్టర్‌ని చేయగలిగాను. సుధీర్‌ బాబుతో కలిసి వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. మహేష్‌ బాబు మా ట్రైలర్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇది మంచి సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌. స్టన్నింగ్‌ విజువల్స్‌ ఉంటాయి. ఎమోషన్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి మ్యూజిక్‌ ఉంటుంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఖచ్చితంగా ఆడియన్స్‌కి చాలా మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.ప్రేరణ అరోరా చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఈ సబ్జెక్ట్‌ చెప్తున్నప్పుడే అద్భుతంగా అనిపించింది. చాలా మంచి ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో సినిమా నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -