నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డ్ కౌన్సిలర్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి, ఇండి పెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇద్దరూ ఓడిపోయారు. దీంతో వారు ఓటమిని తట్టుకోలేక వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అదే వార్డుకు చెందిన ఓ మైనారిటీ దూదేకుల సంఘానికి చెందిన ఓటర్లతో వాద్విదానికి దిగినట్లు తెలిసింది. డబ్బులు తీసుకుని మాకు ఓట్లు వేయలేదని మోసం చేశారని అందుకే ఓడిపోయామని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఆ సంఘ సభ్యులైన ఓటర్లను నిలదీశారు.
దీంతో ఆ దూదేకుల మైనారిటీ సంఘ పెద్దలు, కుల సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ ఇద్దరు అభ్యర్థులను నిలదీశారు. మీ ఇద్దరినీ మేము ఎన్నికల్లో నిలబడ మన్నామా.. ఎన్నికల్లో నిలుచుండి మా సంఘం దగ్గరికి వచ్చి డబ్బులు మాకు ఇవ్వండి అని మిమ్మల్ని పిలిచి అడిగామా.. మీరే మీ గెలుపు కోసం మా సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడారు ఓట్లు వేయమన్నారు. మీరు చెప్పిన ప్రకారం ఓట్లు వేసినం. అనవసరంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని 18 వ వార్డులోని దూదేకుల కాలనీ సంఘం కుల పెద్దలు, ఆ సంఘ ఓటర్లు తిరగబడ్డారు. అవసరమైతే మేము వేసిన బ్యాలెట్ బాక్స్ లను తెప్పించి తిరిగి చూయించండి మాకు.. మేము వేయలేదు అంటే అని ఆ సంఘ సభ్యులు ఎన్నికల్లో ఓటమిపాలైన ఆ ఇద్దరు అభ్యర్థులను నిలదీశారు.
ఈ మాటల్లో 18 వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ ఇద్దరు అభ్యర్థులు, వారి తరపు నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి సంఘ సభ్యులను నోటితో అనరాని మాట అనడంతో సంఘ సభ్యులు ఒక్కసారిగా అందరూ కలిసి మూకుమ్మ డిగా తిరగబడి ఒక్కసారిగా ఆ కుల సంఘ ఓటర్లందరూ లేవడంతో పోటీ చేసి ఓడిపోయిన ఆ ఇద్దరు సభ్యులు వారి మద్దతుదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు ఆ కుల సంఘ ఓటర్లు కుల పెద్దలు 100కు డయల్ చేయడంతో కొద్దిగా ఆలస్యంగా పోలీసులు వచ్చినట్టు , ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు మా సంఘం వద్దకు వచ్చి వాదనకు దిగి మా సంఘ సభ్యులను నోటితో అనరాన్ని మాటలతో వాదన చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని దూదేకుల కుల సంఘ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఈ డబ్బులు వ్యవహారం అదే వార్డుకు చెందిన ఒక వ్యాపారి అటు ఓడిపోయిన వ్యక్తుల, ఇటు దూదేకుల కుల సంఘం పెద్దమనుషుల మధ్య చిచ్చు రగిల్చేలా చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది.



