Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంక్షమాపణ చెప్పను

క్షమాపణ చెప్పను

- Advertisement -

కర్నాటకపై నాది నిజమైన ప్రేమ : కమల్‌హాసన్‌ స్పష్టం
చెన్నై : అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పని పక్షంలో తన తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ సంఘాలు చేసిన హెచ్చరికలను తమిళ సినీ హీరో కమల్‌ హాసన్‌ తేలికగా తీసుకున్నారు. తమిళం నుండే కన్నడం పుట్టిందంటూ తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. తనకు న్యాయం, చట్టంపై విశ్వాసం ఉన్నదని చెప్పారు. కన్నడంపై ప్రేమతోనే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. ‘ఇది ప్రజాస్వామ్య దేశం. న్యాయం, చట్టంపై నాకు విశ్వాసం ఉంది. ప్రేమే ఎప్పుడూ విజయం సాధిస్తుందని అనుకుంటాను. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళపై నాకున్న ప్రేమ నిజమైనది. ఓ అజెండా ఉన్న వారు మినహా నా ప్రేమను ఎవరూ అనుమానించరు. నాకు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి. తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను. లేకుంటే చెప్పను’ అని ఆయన విలేకరులతో అన్నారు. డీఏంకే కార్యాలయం అన్నా అరివలయం వెలుపల కమల్‌ విలేకరులతో ముచ్చటించారు. తనకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన డీఏంకే కార్యాలయానికి వచ్చారు. దేశం కోసం డీఏంకే కూటమిలో చేరానని కమల్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img