Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅణ్వాయుధాలు కోరుకోవడం లేదు

అణ్వాయుధాలు కోరుకోవడం లేదు

- Advertisement -

కానీ మా హక్కులు పరిరక్షించుకుంటాం
స్పష్టం చేసిన ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌
టెహ్రాన్‌ :
అణ్వాయుధాలను తాము కోరుకోవడం లేదని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. అయితే అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో తమకున్న చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించుకుంటూనే ఉంటామని తేల్చి చెప్పారు. పెజెష్కియాన్‌ మంగళవారం యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌తో టెలిఫోన్‌లో ముచ్చటించారు. రెండు దేశాలు ‘బలవంతంగా అన్యాయమైన ఆకాంక్షలను రుద్దలేవ’ని పెజెష్కియాన్‌ తెలిపారు. ‘అమెరికాతో మాట్లాడేటప్పుడు వారికి ఓ విషయం చెప్పండి. ఇరాన్‌ కేవలం తన చట్టబద్ధమైన హక్కులను మాత్రమే పరిరక్షించుకుంటుందని తెలియజేయండి’ అని యూఏఈ అధ్యక్షుడిని పెజెష్కియాన్‌ కోరారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని, వాటి ని ఉపయోగించాలని ఇరాన్‌ ఎన్నడూ కోరుకోలేదని ఆయన చెప్పినట్లు అధికార ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థ తెలియజేసింది. చర్చల ద్వారా అన్ని వివాదాలనూ పరిష్కరించుకునేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నదని కూడా ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad