Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజాసేవ చేయడం బాధ్యతగా భావిస్తున్న..

ప్రజాసేవ చేయడం బాధ్యతగా భావిస్తున్న..

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
ప్రజాసేవ చేయడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నానని టిపిసిసి మాజీ కార్యదర్శి, బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు తండాల్లో గిరిజన మహిళలకు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైజెనిక్ వాటర్ క్యాన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలనూ మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఎదుటివారికి సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ఎండీ నయీమ్, జేతురాం తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు నేతవత్ వీరు నాయక్, రాయపర్తి గ్రామ అధ్యక్షుడు మచ్చ రమేష్, నాయకులు కిషన్ నాయక్, యాకుబ్ నాయక్, విజయ్ నాయక్, బద్రు నాయక్, వీరన్న, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad