Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముసురు కుంది

ముసురు కుంది

- Advertisement -

– జిలాల్లో ఎడతెరిపిలేని వాన
– పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
– ఓసి గనులలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ-భూపాలపల్లి

 జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంట లు, డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. శనివారం ముసురు పెట్టింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. గత నాలుగు రోజులుగా కురు స్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందు పడ్డారు. కాగా జిల్లాలోని  పలిమెల,  మహముతారం, టేకుమట్ల, మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత నాలుగు రోజులుగా  ఎడతెరిపిలేకుండా జోరువాన కురిసింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లు తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ప్రధానంగా మంథని నియోజకవర్గం  మహాముత్తారం, మండలంలోని అటవీ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గణపురం మండలంలోని వెళ్తుర్లపల్లి కొండా  పురం మధ్యలో ఉన్న మోరంచవాగు ఉప్పాంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు ఇదిలా ఉంటే  టేకుమట్ల మండలం గరిమెళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు  మధ్యలో ఉన్న మానేరు వాగు పై నిర్మించిన తాత్కాలిక రోడ్డు గత వారం  రోజల నుండి కురుస్తున్న వర్షాలు వల్ల కొట్టుకపోయినది పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా రాకపోకలు అంతరాయం కలిగింది.

ఓసి గనులలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. గత 4 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న బారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని 2, 3వ గనుల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.ఇప్పటివరకు వర్షం కారణంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితో పాటు, 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

భూపాలపల్లి జిల్లాలో 246.4 మి.మీ వర్షపాతం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 765.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మహాదేవపూర్ 17.8 మి.మీ, పలిమెల 32.4 మి.మీ, ముత్తారం 11.8 మి.మీ. కాటారం 30.6 మి.మీ, మల్హర్ 15.2 మి.మీ, చిట్యాల 22.8 మి.మీ, టేకుమట్ల 21.0 మి..మీ, మొగుళ్లపల్లి 22.4 మి.మీ, రేగొండ 26.2 మి.మీ, గణపురం 19.4మి.మీ, భూపాలపల్లి 26.8మి.మీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
 వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు, చెరువులు, నదిలోకి వెళ్ళొద్దని తెలిపారు.  సెల్ఫీలు, రీల్స్ చేయడానికి వెళ్ళొద్దని పటిష్ట పర్యవేక్షణ చేయాలని అనుమతి లేదని ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు.  వర్షంలో విద్యుత్  సబ్ స్టేషన్లు, సెల్ టవర్లు, చెట్ల కింద  నిలబడరాదని విద్యుత్ ప్రమాదం జరిగే ఆవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు తదితర వాటిని తాకరాదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం లేదా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్ 9030632608 కు కాల్ చేయాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు

అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలి:   భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే 
భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ లోతట్టు ప్రాంతాలను, చెరువులు, కుంటలను గోదావరి, మానేరు నదులను చూడడానికి వెళ్లకూడదని, వెళితే  ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని  ఇళ్లలో నుండి బయటికి రాకూడదన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 58129 సంప్రదించాలని సూచించారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావం ఉన్న ప్రజలను  అప్రమత్తం చేయాలని  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -