Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెలరోజులైనా పాడి పైసలు రాలేవు 

నెలరోజులైనా పాడి పైసలు రాలేవు 

- Advertisement -

ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు 
నవతెలంగాణ-రామారెడ్డి 

నెలరోజులు పూర్తయినా పాడి రైతులకు డబ్బులు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలోని పోసానిపేట, రామారెడ్డి, ఉప్పల్వాయి, గిద్దతోపాటు గొల్లపల్లికి చెందిన దాదాపు 250 మంది రైతులు విజయ డైరీ కి పాలను విక్రయిస్తారు. ప్రతి 15 రోజులకు సంబంధిత డబ్బులను చెల్లిస్తారు. అక్టోబర్ నెలకి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు రైతులకు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దాదాపు రూ.6 లక్షల పాడి రైతులకు విజయ డైరీ నుండి రావాల్సి ఉందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వరి కోతలు ప్రారంభం కావడంతో, కోతలకు పెట్టుబడి, పాడి పశువులకు దాన తదితర ఖర్చులు ఇబ్బందిగా మారాయని, సంస్థ యజమాన్యం, అధికారులు స్పందించి రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -