”మార్క్’ సక్సెస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మాస్ హీరోయిన్ అనే ట్యాగ్ ప్రెషర్‌గా కాకుండా ఒక ఆశీర్వాదంలా అనిపిస్తోంది’ అని అంటున్నారు కథానాయిక దీప్శిఖా చంద్రన్. ఆమె నటించిన తాజా చిత్రం ‘మార్క్’. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈచిత్రంతో దీప్శిఖాకి మరిన్ని అవకాశాలొస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘మార్క్’ సినిమాలో నా నటనకు సూపర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. పైగా కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోయిన్‌గా గుర్తింపు సొంతం చేసుకోవడం చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీలవుతున్నాను. ప్రేక్షకులు నన్ను స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌లో అంగీకరించడం నా కెరీర్‌లో చాలా పెద్ద విజయం. నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.
‘కిచ్చా’ సుదీప్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయనతో నటించడం అనేది ఒక లెర్నింగ్ స్కూల్ లాంటిది. నేను చెన్నైలో పుట్టి, పెరిగినా తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటిస్తున్నాను. ఎందుకంటే భాష అనేది ఒక మీడియం మాత్రమే. ఎమోషన్ యూనివర్సల్. ‘మార్గన్’లో విజరు ఆంటోనీతో కలిసి నటించాను. ఆయన శాంతంగా, కామ్‌గా ఉండే వ్యక్తి. ఆ క్వాలిటీస్‌నే ఆయన నుంచి నేర్చుకున్నాను.
అలాగే జీఆర్‌సీ జ్యువెలర్స్ కమర్షియల్ యాడ్‌లో సీనియర్ తమిళ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ యాడ్ తర్వాత అవకాశాలు చాలా వచ్చాయి.
ఇక తెలుగులో సూర్య వశిష్ట్‌తో ‘రమణికళ్యాణం’ చిత్రంలో నటిస్తు న్నాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా లేయర్డ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్. సూర్య వశిష్ట్‌తో కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆన్ స్క్రీన్‌లోను, ఆఫ్ స్క్రీన్‌లోను స్ట్రాంగ్ ఉమెన్ నాకు స్ఫూర్తి. అలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఎగ్జైట్‌మెంట్ ఇస్తాయి. స్ట్రాంగ్ అంటే రఫ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అది పవర్‌ఫుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు అని నేను నమ్ముతాను.
శక్తివంతమైన పాత్రలంటే ఇష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



