Sunday, March 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగ్యాస్‌ కావాలి మితోస్ర్‌!

గ్యాస్‌ కావాలి మితోస్ర్‌!

- Advertisement -

కరోనా సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ స్థాయి వైద్య రంగ నిపుణులు చెప్పిన దానికి భిన్నంగా ‘అప్పడాలు తింటే కరోనా రాదు.. చప్పట్లు కొట్టి, కొవ్వొత్తులు వెలిగిస్తే వచ్చిన కూడా కరోనా పోతుంది…’ అంటూ తమదైన శైలిలో ఉచిత సలహాలిచ్చారు ‘ప్రపంచ మేధావులు’. వారు ఆ విధంగా ఆషామాషీగా తీసుకుని, జనాన్ని గాలికొదిలేయటం వల్ల ఇండియాలో ఎంతమంది కోవిడ్‌ దెబ్బకు బలయ్యారో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం వల్ల దేశంలో తలెత్తిన గ్యాస్‌ కొరతను నివారించేందుకు మాత్రం ఆ ‘మేధావులు’ ఎలాంటి ఆలోచనా చేయటం లేదు.

ఒకపక్క గ్యాస్‌బండలు దొరకటం లేదు మొర్రో.. అని జనం మొత్తుకుంటుంటే, మరోవైపు దేశంలో గ్యాస్‌ కొరతే లేదని చెప్పటం వారికే చెల్లింది. ఈ క్రమంలో గతంలో తాను ‘గొప్ప ఛాయివాలా…’ అని చెప్పుకున్న ’56 అంగుళాల’ ఛాతిగల ‘మిత్రోన్‌’ ఇప్పుడు తన మేధస్సును ఉపయోగించి డ్రెయినేజీ నుంచి గ్యాస్‌ను వెలికితీసి, జనానికి సరఫరా చేయాలంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇది సోషల్‌ మీడియాలో మస్తు ట్రోలవుతోంది. మరిప్పుడు మన ‘మిత్రోన్‌…’ ఏం చేస్తారో చూడాలి…

-కే.నరహరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -