Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే నేను అన్నాను: మంత్రి సీతక్క

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే నేను అన్నాను: మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్థానిక ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పాను.. ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం లేకుండానే మంత్రులు ప్రకటన చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన మాటలను వక్రీకరించారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని నేను ఎక్కడా చెప్పలేదని స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానన్నారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. నాకు జ్ఞానం ఉందని కేబినెట్ లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని అన్నారు. ఎట్లాగు అడవి బిడ్డలం కాబట్టి మా విషయంలో మీడియాలో ఏది పడితే అది రాయడం తనను ఆవేదనకు గురి చేస్తోందని అన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్తున్నాయని గ్రహించే అదే రోజు నేను వివరణ కూడా ఇచ్చాననని చెప్పారు.
కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆసక్తికర వాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. “కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లివచ్చి బీసీ ఎజెండాను అందుకున్నారు. తాను వెనుకబడ్డాననే భావనతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో” అంటూ వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని, తోడేళ్లలా దోచుకుని ఇప్పుడు వినయం నటిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. “కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే, మా ముఖ్యమంత్రి పౌరుషంతో మాట్లాడుతున్నారు” అని సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -