Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ శుభాసీస్సుల వల్లే తిరిగి కోలుకున్నాను: ఎమ్మెల్యే తోట

మీ శుభాసీస్సుల వల్లే తిరిగి కోలుకున్నాను: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మీకు సేవ చేయడమే నా భాగ్యం, నా బాధ్యత.. ఈరోజు నేను ఈ సందేశాన్ని నా సంపూర్ణ మనసుతో, కృతజ్ఞతతో వినయంతో రాస్తున్నాను అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మే 30వ తేదీ మధ్య రాత్రి, నేను అనుకోని ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నాను. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా నన్ను నా కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి, కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందాల్సి వచ్చింది. జూన్ 6వ తేదీ వరకు నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఆ రోజులు నాకూ, నా కుటుంబానికి ఎంతో కష్టంగా గడిచాయి. ఆరోగ్యాన్ని తిరిగి పొందటం అసాధ్యమైపోతుందేమో అని కొన్నిసార్లు అనిపించింది కూడా. అయితే, మీరు అందించిన మద్దతు, ప్రార్థనలు, ప్రేమతో నేను తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడిని అయ్యాను. మీరు చూపిన ఆదరణ..పంపిన సందేశాలు, నా ఆరోగ్యాన్ని గురించి మీరు చేసిన ప్రయత్నాలు, ప్రార్థనలు నాకు ఎంతగానో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. మీ అందరి సానుభూతి, ప్రేమ, నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నా ఆరోగ్యం గురించి విచారిస్తూ నన్ను చూసేందుకు వచ్చినవారికి, సందేశాలు పంపినవారికి నాకు మానసికంగా ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అందించిన శుభాసీస్సుల వల్లే నేను బలంగా తిరిగి నిలబడగలిగాను. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే నా సంకల్పం ఇప్పటికీ అంతే స్థిరంగా ఉంది. జుక్కల్ అభివృద్ధి విషయంలో, గతంలో మనం ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. నా పూర్తి శక్తి సామర్థ్యాలు వెచ్చించి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు ముందుకు సాగుతున్నాను. మీ ఆదరాభిమానాలు ఉంటే భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలననే ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. మరొక్కసారి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రతినిధిగా ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవంతో, కృతజ్ఞతతో, మీ లక్ష్మీ కాంతారావు తోట – ఎమ్మెల్యే, జుక్కల్ నియోజకవర్గం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -