జెలెన్‌స్కీతో భేటీలో ట్రంప్
ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అలసిపోయింది
దీనిని ముగించేందుకు త్రైపాక్షిక సమావేశం అవసరం : ట్రంప్
అమెరికా నుంచి స్పష్టమైన హామీలు కోరిన జెలెన్‌స్కీ
శ్వేతసౌధంలో ముగిసిన అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల సమావేశం
వాషింగ్టన్ : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ కాదు. శాంతి కావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అలసిపోయిందనీ, దీన్ని ముగించేందుకు త్రైపాక్షిక సమావేశం అవసరమని తెలిపారు. శాంతి ఒప్పందం అంగీకరించడం కోసం అమెరికా నుంచి తమకు కావాల్సిన విషయాలపై జెలెన్‌స్కీ స్పష్టమైన హామీని కోరారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ సురక్షితంగా ఉండటానికి ఏమీ అవసరమో ట్రంప్‌నకు జెలెన్‌స్కీ విమరించారు. ఇందులో ఆయుధాల అమ్మకాలు, ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. యూరోపియన్ నాయకులతో చర్చించిన తరువాత వివరాలు వెల్లడిస్తానని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శ్వేతసౌధం(వైట్‌హౌస్)లో సోమవారం భేటీ అయ్యారు. జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌కు చేరుకున్న సందర్భంగా ఆయనకు ట్రంప్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..
శాంతి కోసం ఉక్రెయిన్‌తో సహా అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు. దీర్ఘకాలిక శాంతికి ప్రయత్నిస్తామన్నారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు త్రైపాక్షిక సమావేశం అవసరాన్ని ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఈ సమావేశం అంతా సజావుగా సాగితే రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్వరలోనే త్రైపాక్షిక సమావేశం జరగనుందని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు సహేతుకమైన అవకాశం ఉంటుందన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకుంటున్నందుకు ట్రంప్‌నకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ ఆలోచనను తాము సమర్థిస్తున్నట్టు తెలిపారు. రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్ధంగా ఉన్నట్టు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
ఇటీవల అలస్కా వేదికగా రష్యా అధినేత పుతిన్‌తో ట్రంప్ సమావేశం అనంతరం ఈ భేటీ నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓవల్ ఆఫీస్ వేదికగా జెలెన్‌స్కీ-ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు ఈసారి భేటీకి ఐరోపా, నాటో నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్, నాటో చీఫ్ మార్క్ రుట్టె తదితరులు వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ కీలక సమావేశం వేళ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సైరన్ల మోత మోగడం గమనార్హం.
శాంతి కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES